Wednesday, January 22, 2025

కూతురిపై అత్యాచార యత్నం.. తండ్రికి 20 ఏళ్లు జైలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కన్న కూతురిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ 12వ మెట్రోపాలిటన్ సెషన్స్, స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి అనిత గురువారం తీర్పు చెప్పారు. బాధిత బాలిక విద్యా ఖర్చులకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని హబీబ్‌నగర్‌కు చెందిన ఎండి అబ్దుల్ హఫీజ్‌కు భార్య ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారిన నిందితుడు మద్యం తాగి ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉండేవాడు. అతడి భార్య పిల్లలను తీసుకుని వెళ్లి భిక్ష మెత్తుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే నవంబర్,30, 2021న నిందితుడి భార్య తన పిల్లలతో కలిసి బెగ్గింగ్ కోసం బయటికి వెళ్లింది.

ఇంట్లో పెద్ద కుమార్తె(10) ఉంది,బాలిక పెద్దమ్మ అదే భవనంలో అద్దెకు ఉంటోంది. ఇంటి యజమానికి అద్దె చెల్లించేందుకు వెళ్లగా నిందితుడు తన కుమార్తెను లైంగికంగా వేధించడం చూసింది. బాలిక రూమ్‌ను లోపలి నుంచి లాక్ చేసింది. పక్కన ఉన్న వారు అందరు కలిసి డోర్‌ను పగుల గొట్టి బాలికను కాపాడారు. బాలిక తల్లి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పడంతో హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టుకు సాక్షాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై సైదులు కేసు దర్యాప్తు చేసి కోర్టుకు సాక్షాలు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News