Friday, December 20, 2024

అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం….మీర్‌పేట, జిల్లేలగూడకు చెందిన ఎండి సమీరా భర్త సల్మాన్ ఖాన్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. దానిలో పనిచేసేందుకు బీహార్ రాష్ట్రానికి చెందిన తాజేబుల్ ఖాన్ తీసుకుని వచ్చి పనిలోపెట్టారు. ఈ క్రమంలోనే బాలిక(6)పై కన్నేసిన నిందితుడు తాజేబుల్ ఖాన్ మార్చి 29,2022న రూమ్‌లో బాలిక నిద్రిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి ఇన్స్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి సాక్షాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన పోక్సో కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News