Thursday, January 23, 2025

కాళహస్తి లాడ్జిలో హైదరాబాద్ వ్యాపారికి కిలేడీ ఝలక్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఒక లాడ్జిలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి నుంచి రూ. 20 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను ఒక కిలాడీ లేదీ కాజేసింది. పోలీసుల కథనం ప్రకారం బస్సులో తిరుపతికి వెళుతున్న ఒక వ్యక్తి ఆదివారం రాత్రి శ్రీకాళహస్తిలో దిగిపోయాడు. అక్కడ సుమారు 30 ఏళ్లు ఉన్న ఒక మహిళ పరిచయం అయింది.

లాడ్జీకి వెళ్లి గడుపుదామని ఆమె అడగంతో ఇద్దరూ ఒక లాడ్జీకి వెళ్లి రూము తీసుకున్నారు. రాత్రి లాడ్జిలో గడిపిన ఆ వ్యాపారి తెల్లారి లేచి చూసేసరికి గదిలో ఆ మహిళ లేదు. బంగారు నగలు, మొబైల్ ఫోన్, నగదు చోరీ జరిగినట్లు గుర్తించాడు. రాత్రి ఆమె ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు కలిపి ఉంటుందని, అది తిని తాను స్పృహ కోల్పోయానని బాధితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు దర్యాప్తు చేస్టున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News