Monday, December 23, 2024

బస్సు కింద పడినా చెక్కుచెదరని వృద్ధుడు (షాకింగ్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: బస్సు ఢీకొని మీద నుంచి వెళ్లిపోయినా ఒక వృద్ధుడు శరీరంపై ఎటువంటి గాయలేకుండా ప్రాణాలతో బయటపడిన షాకింగ్ సంఘటన మంగళవారం ముంబైలో జరిగింది. పవాయి ప్రాంతంలోని లేక్‌సైడ్ కాంప్లెక్స్ సమీపంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్స్ అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపైన జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలను అక్కడి సిసి కెమెరా రికార్డు చేసింబ్కుర్తా పైజామా ధరించిన ఒక గుర్తు తెలియని వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడమేకాక ఆయనపైనుంచి వెళ్లిపోయింది.

బస్సు కింద పడిపోయిన ఆ వృద్ధుడికి ఏమైందోనని పాదచారులు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. బస్సు డ్రైవర్ కూడా ముందుకు వెళ్లి బస్సును ఆపి డోర్ తీసి దిగబోయాడు. ఇంతలో బస్సు కిందపడిన ఆ వృద్ధుడే నడుచుకుంటూ వచ్చి బస్సు డ్రైవర్‌తో వాదులాడడం వరకు సిసి టివి ఫుటేజ్‌లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు భారీ షాపింగ్ మాల్స్ ఉన్న ఇరుకైన రోడ్ల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News