తీర్పు చెప్పిన ఎల్‌బి నగర్ కోర్టు
హైదరాబాద్: మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. సరూర్‌నగర్ మండలానికి చెందిన షేక్‌బాబా పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి కుటుంబం నిందితుడి ఇంటి పక్కనే ఉంటున్నారు. బాధిత యువతి(28) మానసిక వికలాంగురాలు. దీంతో ఆమెపై అత్యాచారం చేయాలని నిందితుడు చాలా రోజుల నుంచి సమయం కోసం వేచిచూస్తున్నాడు. ఈ క్రమంలోనే మే10,2013వ తేదీన బాధితురాలి కుటుంబం మొత్తం బిల్డింగ్‌పైన రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. ఇదే అనుకూల సమయమని భావించిన నిందితుడు తెల్లవారుజామున 1గంటకు యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత బాధితురాలు కేకలు వేయడంతో పట్టుకునేందుకు యువతి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కాని నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టడంతో కోర్టు తుది తీర్పు చెప్పింది. ఇన్స్‌స్పెక్టర్లు రవీందర్, ఆనంద్ భాస్కర్ తదితరులు దర్యాప్తు చేశారు.