Thursday, December 19, 2024

పింఛన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పూడూరు: పింఛన్ కోసం కన్న తండ్రిని కొట్టి చంపిన కేసులో కుమారుడికి వికారాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో యావజీవ కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరుమాన విధించినట్లు చన్‌గోములు ఎస్‌ఐ భీంకుమార్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన తెలిపిన ప్రకారం వివరాలీలా ఉన్నాయి. పూడూరు మండల పరిధిలోని సోమన్‌గుర్తి గ్రామ పంచాయతీకి చెందిన గుడిపల్లి వెంకటయ్య తన కన్న తండ్రి రామయ్యకు నెల నెల వచ్చె పింఛన్ డబ్బులు ఇవ్వాలని గత 2020 జూన్ 10వ తేదిన తండ్రి రామయ్యను అడగగా అందుకు నిరాకరించడంతో ఇంట్లో కొట్టి త్రాడుతో కొందుకు ఊరివేసి చంపాడు.

ఈ విషయంలో అప్పట్లో ఎస్ భీంకుమార్, అప్పటి సిఐ లక్ష్మీరెడ్డిలు క్రైం నెంబర్ 79/2020 యు/ఆర్ 307 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోద్ చేసుకుని కోర్టుకు పంపించారు. ఈ కేసు విషయంలో బుధవారం వికారాబాద్ జిల్లా కోర్డు వెంకటయ్యకు జీవిత జైల్ శిక్ష వేసి రెండు వేల జరిమాన విధించినట్లు ఎస్‌ఐ భీంకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News