Sunday, December 22, 2024

ఆటోపై శివాజీ కోట..నెటిజన్ల ఫిదా(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: వినూత్నంగా ఆలోచించడం నేటి ట్రెండ్. కొత్త ఆలోచనలకు వేదికగా ఈనాటి సోషల్ మీడియా రూపొందింది. పాత వస్తువులకు కొత్త రూపం ఇచ్చి దాన్ని సోషల్ మీడియా ద్వారా పది మందితో షేర్ చేసుకోవడం ఇప్పటి తరం ట్రెండ్.. అటువంటి ఆలోచనతోనే రాథోడ్ గజానన్ అనే వ్యక్తి తన పాత ఆటోను ఛత్రపతి శివాజీ కోటగా మార్చేశాడు. ఏకంగా తన ఆటోపైనే శివాజీ కోట కట్టేశాడు.
ఆటో చుట్టూ ఇటుకతో నిర్మించిన కట్టడం, దాని పైన రాతి కోట ఏర్పాటు చేశాడు రాథోడ్. ఆటో చుట్టూ పూర్తిగా కోట నిర్మాణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాథోడ్ కళాత్మక సృష్టిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వాకా 43 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News