- Advertisement -
మెదక్: తల్లిమందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం రగీంగూడలో ఆదివారం చోటుచేసుకుంది. ఐటిఐ చేసిన వంశీ సెల్ ఫోన్ వ్యసనంగా మారిందని తల్లి మందలించింది. దీంతో వంశీ శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామ శివారు చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరేసుకుని వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి.
- Advertisement -