Wednesday, January 22, 2025

ఫోన్ దొంగలించాడని?… బావిలో బాలుడిని వేలాడదీసి…

- Advertisement -
- Advertisement -

Man hangs minor inside well in Madhya Pradesh

ఛతర్‌పూర్ న్యూస్: మైనర్ బాలుడు ఫోన్ దొంగలించాడనే అనుమానంతో పిల్లవాడి చేతులు పట్టుకొని బావిలో వేలాడదీసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అజిత్‌రాజ్‌పూత్ అనే వ్యక్తి ముబైల్ కనిపించకపోవడంతో మైనర్ బాలుడు దొంగతనం చేశాడని అనుమానించాడు. వెంటనే బాలుడిని పట్టుకొని బావిలో వేలాడదీశాడు. అక్కడే ఉన్న మరో బాలుడు తన ఫోన్‌లో ఈ వీడియోను రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వెంటనే రాజ్‌పూత్ వీడియో రికార్డు చేసిన బాలుడిపై దాడి చేశాడు. ఈ వీడియో తల్లిదండ్రులకు చేరడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపిసి సెక్షన్ 08 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

https://www.youtube.com/watch?v=4ojrK_0Rft4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News