Monday, December 16, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ఓ సంస్థపై బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బషీర్ అనే వ్యక్తి తాజ్ డెక్కన్ హోటల్‌లో రూము తీసుకుని మోసానికి తెరతీశాడు. ష్యాబ్రిల్ ఓవర్సీస్ పేరుతో సోషల్ మీడియాలో పేజీని ఏర్పాటు చేశాడు. దాని ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేశాడు.దీనిని నమ్మిన పలువురు హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగులు నిందితుడిని సంప్రదించారు.

దాదాపుగా 150మంది నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసి జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చాడు. వాటిని తీసుకుని సంస్థకు వెళ్లిన నిరుద్యోగులకు తమకు ఇచ్చినవి నకిలీ లెటర్లని తేలడంతో ఒక్కసారిగా షాక్‌గురయ్యారు. వెంటనే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News