Monday, December 16, 2024

మసీదుకు బాంబు బెదిరింపు: మహబూబ్‌నగర్‌లో నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నగరంలోని మతపరంగా సున్నిత ప్రాంతమైన శివాజీనగర్‌లోగల మసీదులో బాంబు ఉన్నట్లు బూటకపు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన సయ్యద్ మొహమ్మద్ అన్వర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మసీదుల నుంచి మద్రాసాల కోసం విరాళాలు వసూలు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు సోమవారం తెలిపారు.

శివాజీనగర్ ప్రాంతంలోని రస్సెల్ మార్కెట్ సమీపంలో ఉన్న ఆజం మసీదు నుంచి విరాళం వసూలు చేసిన నిందితుడు రాత్రి అక్కడే బస చేయడానికి అనుమతి కోరగా మసీదు సిబ్బంది నిరాకరించారని వారు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు వెళ్లే బక్కు ఎక్కాడని, బస్సు దేవనహళ్లి దాటగానే మసీదులో ఉగ్రవాదులు బాంబు పెట్టినట్లు నంబర్ 122 ఓఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశాడని వారు తెలిపారు. ఈ సంఘటన జులై 5వ తేదీ రాత్రి జరిగిందని వారు వివరించారు.

బాంబు బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే మసీదుకు చేరుకుని రాత్రంతా తనిఖీలు నిర్వహించారని వారు చెప్పారు. పోలీసులు, బాంబు నిర్వీర్య దళం నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి బాంబు లభించకపోవడంతో ఇది బూటకపు బాంబు వెదిరింపుగా తేలిపోయింది. దీనిపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి ని కర్నూలు నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ వెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని వారు చెప్పారు.

నిందితుడు నిరుద్యోగ బిఎస్‌సి గ్రాడ్యుయేట్ అని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు. మద్రాసాల కోసమని చెప్పి విరాళాలు సేకరించడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. అతుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News