Wednesday, January 22, 2025

ఆకాశంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వ్యక్తి అరెస్టు!

- Advertisement -
- Advertisement -

సియోల్: ఓ ప్రయాణికుడు శుక్రవారం దక్షిణ కొరియా విమానం ఎగ్జిట్ డోర్‌ను ఆకాశంలో ప్రయాణిస్తుండగానే తెరిచాడు. దాంతో గాలి ప్లేన్ కాబిన్‌లోకి వీచింది. అయినప్పటికీ విమానం సురక్షితంగా దిగిందని ఎయిర్‌లైన్, ప్రభుత్వ అధికారులు తెలిపారు. విమానం తలుపు తెరుస్తుండగా ఏషియాన ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఎ321లోని మిగతా ప్రయాణికులు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ విమానం పాక్షికంగా తెరుచుకుందని అక్కడి రవాణా మంత్రి తెలిపారు.

194 మందితో కూడిన విమానం జెజు దక్షిణ ద్వీపం నుంచి ఆగ్నేయ నగరమైన డేగుకు వెళుతుండా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఇంకా గంట ప్రయాణించాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు,విమానం తలుపు ఎంత సేపు అలా తెరుచుకుని ఉండింది అన్న విషయమై పరిశోధన జరుగుతున్నట్లు ఏషియానా ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఒక వ్యక్తి ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో కూడా తీశాడు. దాని సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. గాలి తీవ్రంగా వీస్తున్నప్పుడు కొందరి జుట్టు పైకెగురుతూ కనపడింది. విమానం ఎమర్జెన్సీ తలుపు తెరిచిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారేమి చేయనున్నారో తెలియలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News