Monday, January 20, 2025

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంకు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ :ఇక్కడి నరేంద్రమోడీ స్టేడియంలో పేలుడు సంభవించవచ్చని బెదిరిస్తూ ఇ మెయిల్ పంపిన వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌లు రాజ్‌కోట్‌లో బుధవారం అరెస్టు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు ఒక వేదికగా ఈ స్టేడియం ఉంటోంది. ఇండియాపాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఈనెల 14న ఈ స్టేడియంలో జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఇ మెయిల్ ద్వారా బెదిరించడం తీవ్రంగా పరిగణించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి రాజ్‌కోట్ శివారులో ఉంటున్నాడు. ఇతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News