Monday, December 23, 2024

పవార్‌కు బెదిరింపులు: పుణెలో వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

పుణె: ఎన్‌సిపి అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్‌ను చంపివేస్తానంటూ బెదిరించిన మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ముంబైలో పోలీసు అధికారి ఒకరు సోమవారం తెలిపారు. నిందితుడు సాగర్ బర్వే ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన డాటా ఫీడింగ్, అనాలిటిక్స్‌లో పనిచేస్తున్నాడని ఆ అధికారి చెప్పారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు బర్వేను ముంబైకు తీసుకువచ్చి కోర్టులో హారుపరచగా అతడికి మంగళవారం వరకు పోలీసు కస్టడీకి ఇచ్చినట్లు ఆ అధికారి తెలిపారు.

2013 ఆగస్టు 20న పుణెలో కాల్చివేతకు గురైన హేతువాద కార్యకర్త నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే 82 ఏళ్ల శరద్ పవార్‌కు కూడా పడుతుందని సోషల్ మీడియాలో హెచ్చరిక రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్‌ను బెదిరించిన వ్యక్తిని పుణుకు చెందిన సాగర్ బర్వేగా గుర్తించి అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News