ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతానంటూ హల్చల్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, వెలుగుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బయ్య కనకయ్య జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం గ్రామానికి వచ్చి దరఖాస్తు చేశాడు. అధికారులు విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశాడు.
దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎలాగైనా ఇల్ల్లు ఇప్పిస్తామంటూ బతిమిలాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు కిందికి దిగాడు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్ల్లు ఇప్పిస్తానని గ్రామానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నేత తన వద్ద డబ్బులు కూడా తీసుకుని మోసం చేశాడని వాపోయాడు. మొద