Monday, December 23, 2024

రక్త దాత.. ప్రాణ దాతే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేను మహబూబా బాద్ జిల్లా లో పనిచేస్తున్న. గూడూరు నుంచి అటవీ ప్రాంతం ఐన కొత్తగూడ కు వెళ్తున్నా.. సాయంత్రం 6 కావస్తుంది. మరో గంట ఐతే?! రాక పోకలు బంద్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని సాయుధ బలగాలు జనసంచారాన్ని నియంత్రిస్తారు. అందుకే పెద్దగా సాయంకాలం వేళ ల్లో ప్రయాణాలు పెట్టుకోరు.అత్యవసరం ఐతే..తప్ప. ఓ విశ్వాసనీయ సమాచారం అందుకున్న నేను ఓ రైస్ మిల్లు పై నిఘా కోసం చీకటి పడే వేల ఐనా..వెళ్ళక తప్పలేదు.మరో పది నిముషాల్లో మిల్లు కు చేరుకుంటా..అంత లో, రోడ్డు పై ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ప్రమాదానికి గురై,అపస్మారక స్థితిలో ఉన్నాడు. రోడ్డు బాగాలేక పడి ఉంటాడా.. ఏదైనా. వన్య ప్రాణుల ను తప్పించబోయి బైక్ పై నుంచి పడ్డాడా ఆన్న విషయం అర్దం కాలేదు. ఆలోచిస్తుంటే సమయం గడుస్తోనే ఉంది.రక్తం కారుతూ..నే ఉంది. చలి నుంచి నన్ను నేను కాపాడుకోవడం కోసం కట్టుకున్న చేతి రుమాలును చించి గాయం పై కట్టేసా..

మనిషి ఉలుకు పలుకు లేదు.శ్వాస ఉంది. ఎదో చేయాలి.ప్రాణం నిలబెట్టాలి.ఫోన్ చూస్తే సిగ్నల్ ఒక్క పాయింట్ ఉంది. గూడూరు కు ఫోన్ చేసి . ఓ వ్యక్తి పరిస్తితి ఇలా ఉంది.నేను అతన్ని తీసుకు వస్తున్న అని చెప్పా అరగంట లో పు తీసుకు రాక పొతే క్లీనిక్ కట్టేస్తాం అని చెప్పారు. అంతే..ఏమ్ చేయాలి ..పడి ఉన్న వ్యక్తి నోట్లో ఏదో శబ్దం సన్నగా వినిపిస్తోంది.దూ..ప.. దూ..ప. నీళ్ళు అని.నా వెంట బ్యాగ్ లో ఉన్న బాటిల్ నీళ్ళు కొన్ని ముఖం పై చిలకరిoచా.. కాస్త తేరుకున్నాడు.మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్ళు తాగించా. నా చొక్కా విప్పి ..అతన్ని నా బైక్ పై కూర్చో బెట్టుకొని .వ్యక్తి పడిపోకుండా చొక్కా ను మా ఇద్దరికీ కట్టెసా.ఇంకా ఇరవై నినిషాలే ఉంది. మరో వైపు వెలుతురు తగ్గి చీకటి ముసురుతోంది. మరో రెండు నిమిషాల్లో క్లీనిక్ మూస్తారు అంటుంటే చేరుకున్నా..

ఏమైంది..ఇతనికి అని నర్స్ అడిగింది. ముందు అతనికి బ్లడ్ ఎక్కించండి బాగానే పోయినట్టుంది.అని రిక్వెస్ట్ చేశా.ఏమో ఈనది ఏ గ్రూపో .అది మన వద్ద ఉండాలె గా సార్..సీరియస్ ఐతే మైబ్బాదొ,నర్సంపేట కో తీస్కపొండ్రి అన్నది.ఇప్పుడు అవన్నీ ఎందుకు లే మేడం. బీ పాజిటివ్ ఐతే నేనే ఇస్తా.అన్నా.సరే అని రక్తం చెక్ చేసింది.మనం లక్కీ సార్ ఇతని రక్తం బీ పాజిటివ్వే అని చెప్పి.వైద్యం చేసింది. మేడం.ఇతను కొలుకున్నాక నాకు కబురు పెట్టండి అని చెప్పి నేను బెడ్ పై పడుకుని 250 మిల్లీ లీటర్ల రక్తం దానం చేశా. సమయం ఎనమిది. రక్త దానం తర్వాత నేను మానుకోట కు వచ్చేశా. తెల్లారి నేను లేవక ముందే ఫోన్ మోగింది.”సార్.. నా పేరు ఐలయ్య.నిన్న కొత్తగూడ రోడ్డు లో అడవి దున్న గుద్దితే పడిపోయింది నేనే. ఇయ్యాల్నే మేల్..కొచ్చింది. ఎవరో ఎన్ఫోర్స్ మెంట్ డీ టీ సార్ అట.ఆయన నిన్ను తెచ్చే పట్కే బతికి పోయినవ్.

లేక పోతే పోయే టో.. డీ..వే అని డాక్టర్ చెప్పింది. మా ఉంట్లోల్లే నా గురించి పట్టించు కోరు.మీరు ఎవలో తెల్వదు మీ రక్తం ఇచ్చి బత్కించిండ్లట” అని ఏడ్వవట్టిండు.సరే మరేం పర్లేదు జాగర్తగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పా. లే.. డ్సార్ మిమ్ముల కల్వాలే. అటెన్న్క నే నేను ఇంటికి పోవుడు అని .పట్టు వట్టిండు.సరే సరే నేనే వస్త్తా ఆగు అని మధ్యాహ్నం లోపు క్లినిక్ వెళ్ళా.
సార్ నమస్కారం మీరు తెచ్చిన పేషంట్ ఆడ ఉన్నాడు అని క్లినిక్ బయట ఉన్న మర్రి చెట్టు చూపింది.ఏమ్ ఐలయ్య ఎలా ఉన్నావ్..అని అడిగా. నిన్ను ఈడికి తెచ్చిన సారు ఈననే అని నర్స్ పరిచయం చేసింది.నేను ఇగ బత్క. సస్త అని అనుకున్న సారూ.. దేవుని లెక్క ఒచ్చి కాపాడిం..డ్లు. అంటూ కాళ్ళు మొక్క వట్టిండు.లే ..లే..చీ.ఏదో ఆ సమయానికి నేను అక్కడ ఉన్నా. నాకు చేతనైంది చేశా అని చెప్పా.నీకు నేను ఏమియ్యాల్నో తెలుస్తలేదు సారు.నా పాణం నిలవెట్టిండ్రు అని ఓ తెగ భాధవడ వట్టిండు.ఇంతలోనే అతని తల్లి,భార్య, పిల్లలు వచ్చారు.

వస్తూనే సార్..నా ఇంటి దీపం కాపాడిండ్రు మీ రు సల్లగుండాలే అంటూ ..డబ్బు ఇచ్చే ప్రయత్నం చేసింది. నా గాజులు కుదువ పెట్టీ ఇరవై వేలు తెచ్చిన సార్.తీస్కొండ్రి అని చేతిలో పెట్టే యత్నం చెసింది. వద్దమ్మ..వద్దు.ఈ డబ్బు వాపస్ చేసి గాజులు తెచ్చుకో అని.రెండు చేతులు జోడించి నమస్కారం చేశా.పొద్దు పోయినంక అడవి లో ఒక్కరే వెళ్ళకండి అని సూచన చేశా. గత రెండేండ్ల నుంచి ప్రతి రక్షా బంధనం కు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించు కుంటున్న.మేమే హైదరాబాద్ వస్తం.వచ్చి కడతాం అంటే ఎందుకు రాను పోను ఖర్చులు దండగ.నేనే వస్త..గా అని చెప్పా. వాళ్ల ఇంట్లో మా నాన్న మాచన అభిమన్యు ఫోటో పెట్టుకున్నారు.ఈ మధ్యే ఓ అబ్బాయి పుడితే రఘునందన్ అని పేరు పెట్టుకుoటం అన్నారు.వద్దు అని చెప్పి మా నాన్న పేరు వచ్చెలా అభినయ్ అని పిలవమని చెప్పా.

మాచన రఘునందన్
9441252121
ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్
పౌర సరఫరాల శాఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News