Monday, December 23, 2024

కొల్హారిలో వ్యక్తి పై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్:మండలంలోని కొల్హారి గ్రామ శివారులో కొల్హారి గ్రామానికి చెందిన బెదాడే శంకర్ అనే వ్యక్తి పై గుర్తు తెలియని యువకులు గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో కలకలం రేపింది. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ వెల్లడించాన వివరాల ప్రకారం … కొల్హారి గ్రామానికి చెందిన బెదాడే శంకర్ ప్రతీ రోజు తన మేకలు మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లేవాడని తెలిపారు. శనివారం రోజు యదావిధిగా తన మేకలను తోలుకొని గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లగా గుర్తు తెలియని

ఇద్దరు యువకులు ఆకస్మాత్తుగా అతని పై దాడి చేసి అతని చేతిలోని గొడ్డలిని లాక్కొని అతని మెడ పై , వీపు పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు.దాడిలో గాయపడిన శంకర్ వారి నుండి తనను తాను కాపాడుకునేందుకు పారిపోయి గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుడి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన అనుమానిత యువకుల గురించి ఆరా తీస్తున్నామని ఈ దాడికి సంబంధించిన పూర్థి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్సై ఇమ్రాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News