Sunday, January 19, 2025

పెట్రోల్ బంకులో గొడవ…. మర్మాంగాల్లోకి గాలి పంపు పైపును నెట్టి…. ఆన్ చేశాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: గాలి కొట్టే పంపు పైపును మర్మాంగాల్లోకి నెట్టి ఆన్ చేయడంతో ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్‌లోని సిహాని గేట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాకేశ్ మార్గ్‌లో విజయ్ అనే వ్యక్తి పెట్రోల్ పంపులో కారు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. మోహిత్, విజయ్ మధ్య గొడవ జరగడంతో ఇద్దరు దాడి చేసుకున్నారు. గాలి పంపు పైపును విజయ్ మర్మాంగాల్లోకి మోహిత్ నెట్టాడు. అనంతరం గాలి ఆన్ చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News