Tuesday, January 21, 2025

కుత్బుల్లాపూర్ లో వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకిన వ్యక్తి…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రాము(50) కుత్బుల్లాపూర్ లోని ఓ కాలనీలో నివాసముంటున్నారు.సోమవారం ఉదయం రుక్మిణి ఎస్టేట్ సమీపంలో గల వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాటర్ ట్యాంకు కు ఎక్కుతుండగా స్థానికులు గమనించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో రాము వాటర్ ట్యాంకు పైకి ఎక్కి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన రామును స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  వాటర్ ట్యాంక్ మీద నుండి దూకిన వీడియో స్థానికులు సెల్ ఫోన్ లో బంధించడంతో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News