Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి… ఫ్రీజ్‌లో పెట్టి… అదే రోజు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రియుడు తన ప్రియురాలిని చంపి.. ప్రీజ్‌లో మృతదేహాన్ని పెట్టి…. అదే రోజు మరొక యువతిని పెళ్లి చేసుకున్న సంఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తికి నిక్కి యాదవ్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో సాహిల్ ఎస్‌ఎస్‌సి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఉత్తమ్ నగర్‌లో నిక్కి మెడికల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇద్దరు అక్కడ కలుసుకోవడంతో ప్రేమలో పడ్డారు. సాహిల్ కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక అమ్మాయితో సాహిల్‌కు పెళ్లి నిశ్చయం చేశారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో సాహిల్-నిక్కికి గొడవ జరిగింది. ఫిబ్రవరి 9న గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నిక్కి మెడకు డాటా కేబుల్ వైర్ చుట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం అదే రోజు మరో యువతిని సాహిల్ పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సాహిల్ నిందితుడిగా తేలడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News