Sunday, January 19, 2025

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ కలకలం

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బైపాస్ రోడ్డులో సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తన అనుచరులతో ఓ వ్యక్తి పై దాడి చేయించి కిడ్నాప్ కు యత్నించడం తీవ్రకలకలం లేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి శివారులో ఉంటున్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి తన క్లాస్‌మెట్ అన్షితారెడ్డిల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో తనకు డబ్బులు కావాలని ప్రియుడు అవినాష్ రెడ్డిని అడగడంతో ప్రియురాలి అన్షితారెడ్డి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకున్న అన్షితారెడ్డి, అవినాష్‌రెడ్డికి దూరంగా ఉంటూ మరో వ్యక్తితో ప్రేమాయణం మొదలు పెట్టినట్లు సమాచారం.

డబ్బుల విషయంలో అన్షితారెడ్డి సిద్దిపేట్ బిజెపి పార్టీ నాయకుడు చక్రధర్‌గౌడ్‌తో పలుమార్లు అవినాష్‌రెడ్డికి ఫోన్ ద్వారా మాట్లాడించినట్లు పేర్కొన్నారు. అన్షితా రెడ్డికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తొలగించాలని లేని పక్షంలో ఇవ్వల్సిన డబ్బులు ఇవ్వమని చక్రధర్‌గౌడ్ బెదిరించాడని, సమస్య పరిష్కరించుకుందామంటూ మెసేజ్ పెట్టిన చక్రధర్ గౌడ్, ఘట్కేసర్ బైపాస్ రోడ్డులోని వందన హోటల్ వద్దకు రమ్మని చెప్పటంతో, నమ్మి డబ్బుల కోసం వచ్చిన అవినాష్‌రెడ్డి ని కారులోకి కూర్చోమని, చక్రధర్‌గౌడ్ తన అనుచరులతో దాడి చేయించి కిడ్నాప్ కు ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి పోలీసులను ఆశ్రయించి చక్రధర్‌గౌడ్, అన్షితారెడ్డిల పై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News