Wednesday, January 22, 2025

వ్యకిని చితకబాది కారులో ఎక్కించి తీసుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

 

నిజామాబాద్‌ : కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది.  నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో ఓ వ్యక్తిని దుండగులు చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. టీఎస్‌29సీ 6688 నంబరు గల కారులో వ్యక్తి ముగ్గురు వ్యక్తులు కలిసి అపహరణ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.. కిడ్నాప్ కు గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వివరాలు ఆరా తీయగా.. కారు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం తిరుగల్లికి చెందిన బాగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News