Sunday, December 22, 2024

కానిస్టేబుల్ వాహనం ఢీకొన్ని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః కానిస్టేబుల్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బాలానగర్ మెజిస్టిక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ వారం రోజుల నుంచి సెలవులో ఉన్నాడు. ఈ క్రమంలోనే బైక్‌పై వెళ్తుండగా బాలానగర్ మెజిస్టిక్ గార్డెన్ వద్ద కందుకూరి దుర్గయ్య(58)ని ఢీకొట్టాడు. దీంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మల్లికార్జున్ అక్కడి నుంచి పరారయ్యాడు. కానిస్టేబుల్ వాహనం వల్లే దుర్గయ్య మృతిచెందినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News