Friday, December 20, 2024

లైంగిక వేధింపులు.. మామను చితకబాదిన కోడలు

- Advertisement -
- Advertisement -

వనపర్తి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గోపాల్ పేట మండలంలోని చెన్నూర్ లో కోడలు చంద్రకళను మామ రాములు లైంగికంగా వేధించాడు. దీంతో కోడలు కర్రతో మామను చితకబాదింది. తీవ్రంగా గాయపడిన మామను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. లైంగికంగా వేధిస్తుండడంతోనే మామను కొట్టినట్లు కోడలు ఆరోపిస్తూ.. తనపై మామ లైంగిక వేధింపులను ఫోన్లో చిత్రీకరించిన వీడియోను పోలీసులు చూపించింది. మరోవైపు ఆస్తి కోసమే మామను చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Man killed after daughter in law attacked in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News