Wednesday, January 22, 2025

అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకుల దాడి.. వాలంటీర్ మృతి

- Advertisement -
- Advertisement -

Man killed after father and son attack in Guntur

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం తెనాలిలో తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని అడిగినందుకుసందీప్ అనే వాలంటీర్ పై తండ్రీకొడుకులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వాలంటీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Man killed after father and son attack in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News