Monday, December 23, 2024

వంతెన రూపంలో దూసుకొచ్చిన మృత్యువు… పరుగెత్తినా దక్కని ప్రాణం

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ లోని పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన కూలడాన్ని ఓ వ్యక్తి గమనించి ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కాంక్రీట్ స్లాబుల కింద అతడు నలిగిపోయిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనకు ఇటీవలే ఆరు కాంక్రీట్ స్లాబులు అమర్చారు. అయితే సోమవారం అవి కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మరణించిన తీరు కలచి వేస్తోంది. వంతెన కూలిపోతున్న విషయాన్ని గమనించిన అతడు, తన ఆటోను వదిలి ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తాడు.

కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. అతను ఎంత వేగంగా పరుగెత్తినా, వంతెన స్లాబులు కూలిపోవడంతో వాటి కింద అతడు నలిగిపోయి, ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వాటికింద చిక్కుకు పోయినట్టు ఘటనా స్థలంలోని వ్యక్తులు చెప్పారు. ఆటోతోపాటు ట్రాక్టర్ కూడా వాటికింద నుజ్జునుజ్జు కావడంతో వారు కూడా చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఇది పాలన్‌పుర్ అంబాజీని అనుసంధానించే రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ అని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది అప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News