Monday, January 20, 2025

కోరుట్లలో దారుణం..

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: జగిత్యాల జిల్లా, కోరుట్ల అర్బన్ కాలనీలో గురువారం అనుమల్ల వెంకటరమణ (50) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వెంకటరమణ వడ్డీ వ్యాపారం, పత్రికల ప్రింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణ శివారులోని అర్బన్ కాలనీకి చెందిన వాసాల రఘు అనే వ్యక్తితో వెంకటరమణకు పాతకక్షలు ఉన్నాయి. జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన రఘు, ఇటీవలే తిరిగి వచ్చి గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం రఘు, వెంకటరమణ మధ్య మళ్లీ గొడవ జరిగిన క్రమంలో గురువారం

సాయంత్రం అర్బన్ కాలనీకి ద్విచక్ర వాహనంపై వచ్చిన వెంకటరమణపై కత్తితో దారుణంగా పొడిచాడు.దీంతో తీవ్ర రక్త స్రావంతో వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు రఘు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు వినికిడి. హత్య చేసిన స్థలాన్ని మెట్టుపల్లి డిఎస్‌పి రవీందర్రెడ్డి, కోరుట్ల సిఐ ప్రవీణ్’కుమార్, ఎస్‌ఐ కిరణ్’కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News