Friday, November 22, 2024

ఒకే యువతి కోసం అన్నదమ్ముల ఫైట్.. తమ్ముడి హత్య

- Advertisement -
- Advertisement -

man killed by brother for woman in Visakhapatnam

విశాఖపట్నం: ఒకే యువతి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ.. చివరికి హత్యకు దారి తీసింది. యువతిని పెళ్లి చేసుకోవడం కోసం అన్న తన తమ్ముడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలోని పూడిమడకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మృతుడు ఎర్లయ్య అన్న రాజు కోసం కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. భీమిలీకి చెందిన ఓ యువతితో అన్న రాజుకు వివాహం కుదిరింది. అయితే, యువతి మాత్రం అన్నకు బదులు తమ్ముడు ఎర్లయ్యను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపింది. దీంతో పెళ్లి వ్యవహారంలో అన్నదమ్ముల మధ్య గొడువ జరిగింది. ఈ ఘర్షణలో బలంగా దెబ్బలు తగలడంతో తమ్ముడు ఎర్లయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

man killed by brother for woman in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News