Wednesday, January 22, 2025

బావమరిది చేతిలో బావ హత్య

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీనగర్‌లో సొంత బావను బావమరిది హత్య చేశాడు.అక్కను నిత్యం వేధింపులకు గురిచేస్తూ కొడుతున్నాడనే కోపంతో బావమరిది కర్రతో దాడి చేయడంతో బావ మృతి చెందాడు.ఈ సం ఘటన శనివారం రాత్రి జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీనగర్ శ్రీరామ్‌నగర్ కాలనీ లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామానికి చెందిన కానుగంటి రాజుగౌడ్ (35)తన భార్య భవాని, కుమార్తె, కుమారుడితో కలిసి బాలాజీనగర్‌కు వచ్చి కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నా డు.అత్త పుష్ప,బావ మరిది చందు కూడా వీరితో కలిసి నివాసం ఉంటున్నారు.

శనివారం రాత్రి తాగిన మైకంలో భార్యను కొడుతుండగా అత్త, బావ మరిది అడ్డురాగా వారిపై చేయి చేసుకున్నాడు.బావమరిది అడ్డుతిరిగి బావతో గొడవపడ్డాడు.ఈ గొడవలో బావ మరిది చందు తన బావపై కర్రతో దాడి చేయగా తీవ్ర గాయాలకు గురైయ్యాడు. చికిత్స నిమిత్తం స్థా నికంగా ఉన్న మీనాక్షి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు.సమాచారం అందుకున్న మృతుని తండ్రి కానుగంటి నరసింహ తన కుమారుడు మృతికి కారణమైన కోడలు భవాని, చం దు, పుష్ఫలతపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News