Monday, January 20, 2025

అన్నదమ్ముల మధ్య భూతగాదాలు.. తమ్ముడు దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

భూతగాదాల కోసం మనుషులు రోజురోజుకు ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని కొండాయిపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ విశ్వజన్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిపల్లి గ్రామానికి చెందిన నెత్తి బాలరాజు, నెత్తి నర్సింహులు సొంత అన్నదమ్ములు. అయితే వీరి తల్లిదండ్రుల మీద 13గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని ఇటీవలే రూ.7,47,500కు ఇతరులకు విక్రయించారు. అయితే భూముని విక్రయించగా.. కొనుగోలు చేసిన సదరు వ్యక్తి అడ్వాన్స్‌గా రూ.2లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో నెత్తి బాలరాజు రూ.1.80లక్షలు తీసుకోని, తన తమ్ముడు నర్సింహులుకు రూ.20వేలు ఇచ్చాడు. అయితే నాటి నుంచి వారి మద్య గొడవలు జరుగుతూ ఉండేవి.

అంతేకాకుండా అప్పుడప్పుడు భూ పంచాయితీ, డబ్బుల విషయంలో తరుచుగా గొడవ పడుతుండేవారు. కాగా, శుక్రవారం రాత్రి సైతం డబ్బుల విషయమై అన్నదమ్ముల మద్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. దీనికి కోపోగ్రుతుడైన బాలరాజ్.. కోడంల్‌లో ఉంటున్న భార్య సునీత, కుమారుడు హరికి జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలియపర్చాడు. దీంతో వారు హుటాహుటిన కొండాయిపల్లి గ్రామానికి చేరుకున్నారు. అప్పటీకే నిద్రిస్తున్న నర్సింహులుపై రోకళి బండతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై మృతుడు బావ నల్లి బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వజన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News