- Advertisement -
జోగులాంబ గద్వాల: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామంలో బుధవారం సొంత అన్నను కత్తితో తమ్ముడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్న మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Man killed by brother with knife in Jogulamba Gadwal
- Advertisement -