Sunday, January 19, 2025

అల్లుడిని కొట్టి చంపిన మామ

- Advertisement -
- Advertisement -

అల్లుడిని మామ, బామ్మర్ది కొట్టి హత్య చేసిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మాసబ్‌ట్యాంక్‌లో ఉంటున్న ఆయూబ్(39) ప్లంబర్‌గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తుంచుకున్నాడు. రోజు మద్యం తాగి వచ్చి మామ ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయూబ్ మద్యం తాగిన ఆయూబ్ మామ ఉంటున్న మల్లేపల్లిలోని ప్రైం ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న జియాన్ అర్ట్‌మెంట్ వద్దకు వచ్చి గొడవ చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆయూబ్ మామ మొహినుద్దిన్, బామ్మర్ది బాబా తీవ్రంగా దాడి చేశారు.

ఇద్దరి కలిసి అయూబ్‌ను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అయూబ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అయూబ్ గురువారం మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హబీబ్‌నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News