- Advertisement -
హైదరాబాద్: కత్తులతో స్నేహితుల దాడిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. కుమారుడు పుట్టాడని ప్రశాంత్ అనే వ్యక్తి నిన్న స్నేహితులకు విందు ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న స్నేహితులు పాతకక్షలతో ప్రశాంత్ ను కత్తులతో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రగాయాలతోనే ప్రశాంత్ పోలీసులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ప్రశాంత్ కు కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -