Wednesday, January 22, 2025

బావ ను అతి దారుణంగా హత్య చేసిన బావ మరుదులు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : బావపై కర్రలు, కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ సిఐ నర్సింహ్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం అక్బర్జాపేటలో నివాసముంటున్న మహ్మద్ గౌసుద్దీన్(45) స్థానికంగా ఆర్‌ఎంపి వైద్యుడిగా జీవనం సాగిస్తున్నాడు. గౌసుద్దీన్ భార్య షాబానా బేగం తనకు వివాహం కాకముందు తండ్రితో కలిసి 225 గజాల స్థలం కొనుగోలు చేశారు. అనంతరం షాబానా బేగం మహ్మద్ గౌసుద్దీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. తన తండ్రి చనిపోయే ముందు సదరు భూమిని షాబానా బేగం పేరుపైకి మార్చారు. ఈ భూమి విషయమై షాబానా సోదరులు సయ్యద్ లతీఫ్, సయ్యద్ అల్తాఫ్, సయ్యద్ ముబీన్‌లు షాబానా బేగంతో తరుచు గొడవలు పడుతున్నారు.

ఈ గొడవలతో షాబానా బేగం తన సోదరులకు సదరు 225 గజాల్లో నుంచి 50 గజాల చొప్పున రిజిష్టర్ చేస్తానని చెప్పింది కానీ ఇంకా వారి పేరున రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సయ్యద్ లతీఫ్, సయ్యద్ అల్తాఫ్, సయ్యద్ ముబీన్‌లు షాబానా బేగం ఇంటికి వచ్చారు. భూమి విషయమై షాబానా బేగం, మహ్మద్ గౌసుద్దీన్‌లతో తన బావమరుదులు గోడవపడ్డారు. గొడవ పెరగడంతో మహ్మద్ గౌసుద్దీన్ తలపై కర్రతో సయ్యద్ లతీఫ్ కొట్టాడు. సయ్యద్ ముబీన్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో మహ్మద్ గౌసుద్దీన్ కడుపులో పొడిచాడు. దీంతో కుప్పకూలిపడిపోయిన మహ్మద్ గౌసుద్దీన్‌ను తన భార్య షాబానా బేగం సమీపంలోని మెడిసిటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహ్మద్ గౌసుద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు గౌసుద్దీన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు మహ్మద్ గౌసుద్దీన్ భార్య షాబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News