- Advertisement -
హైదరాబాద్: రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల పట్టణంలో ఆదివారం పిడుగుపాటుకు గురై 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పడిగె సతీష్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం క్రికెట్ ఆడేందుకు సిరిసిల్ల శివారుకు వెళ్లాడు. భారీగా వర్షం కురుస్తుండటంతో ఆడుకోవడం మానేసి పక్కనే ఉన్న చెట్టు కింద తలదాచుకున్నారు. అక్కడ పిడుగుపడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సిరిసిల్ల జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.
- Advertisement -