Wednesday, January 22, 2025

మద్యం మత్తులో మైనర్ బాలుడు వీరంగం

- Advertisement -
- Advertisement -

హత్నూర: మద్యం మత్తులో మైనర్ బాలుడు హత్యకు పాల్పడిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన మంగలి ఆమదయ్య (60) అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు దౌల్తాబాద్ పట్టణంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్స్ పరిధిలో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మైనర్ బాలుడికి, మంగలి ఆమదయ్య కు మాట మాట పెరిగింది.

దీంతో కోపోద్రికుడైన బాలుడు అక్కడే ఉన్న బీరు బాటిల్ తో మంగలి ఆమదయ్య గొంతుపై ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అంతటితో ఆగకుండా కాలుతో తొక్కి హత్య చేసినట్లు సిసి కెమెరాలొ రికార్డ్ అయింది. మృతుడి కుమారుడు మంగలి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని జిన్నారం సిఐ వేణు కుమార్, ఎస్సై లక్ష్మారెడ్డి, క్లూస్ టీం బృందం పరిశీలించారు.పర్మిట్ రూములో ఉన్న సిసి కెమెరా రికార్డు  పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News