Wednesday, January 22, 2025

దూలపల్లి విలేజ్‌లో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గుర్తు తెలియని 35 సంవత్సరాల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లి విలేజీలో ఈ హత్యోందాంతం చోటు చేసుకుంది. ఈ మేరకు డయల్ 100కు ఫిర్యాదు రావడంతో పేట్ బషీరాబాద్ ఎసిపి ఘటనాస్థలికి వెళ్లారు. డాగ్‌స్కాడ్, ఎస్వోటీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించాయి.

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి అతడిని నరికి చంపి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఈ దారుణ హత్యోందాంతానికి సంబంధించి మృతుడు, దుండగులను గుర్తించేందుకు సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News