Friday, March 21, 2025

కుటుంబీకులే కాలయముళ్ళు!

- Advertisement -
- Advertisement -

రోజురోజుకు మానవత్వం మంట కలుస్తుంది. స్వంత కుటుంబీకులు అని కూడా చూడకుండా హత్యలు చేస్తున్నారు. మద్యం మహమ్మరి పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతుంది. నిత్యం మద్యం సేవించి తమను వేధింపులకు గురిచేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీకులే హత్య చేశారు. హత్యచేసిన ఇద్దరి నింధితులను పోలీసులు 24 గంటల్లో రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్ గ్రామానికి చెందిన బక్కని వెంకటేశ్‌కు 14 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికే వెంకటేశ్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ప్రతినిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. మద్యం మత్తులో తరుచుగా భార్య సబిత, తల్లీ లక్ష్మమ్మను వేధించేవాడు. వెంకటేశ్ ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య సబిత, తల్లీ లక్ష్మమ్మలు పెద్దమనుషుల మద్య ప చాయితీ పెట్టారు.

అయినప్పటికీ వెంకటేశ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. యధావిధిగా మద్యం సేవించి ఇంట్లో భార్య సబిత, తల్లీ లక్ష్మమ్మ వేధించడం ప్రారంభించాడు. రోజురోజుకు వెంకటేశ్ వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో వేదింపులు తట్టుకోలేక ఈనెల 19న వెంకటేశ్‌ను తల్లీ లక్ష్మమ్మ, భార్య సబిత ఇరువురు కలిసి ఇనుప రాడ్‌లతో చెవి దగ్గర కొట్టారు. దీంతో బక్కని వెంకటేశ్ రక్తపు మడుగులతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్ మృతినిపై అనుమానాలు ఉన్నాయని తమ్ముడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్‌ల ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి విచారణ చేశారు. కాగా, తల్లీ లక్ష్మమ్మ, భార్య సబితలు వెంకటేశ్ వేధింపులు తాళలేకనే హత్య చేశామని నేరం ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News