Sunday, December 22, 2024

ఎంపిలో అడవి ఏనుగుల దాడిలో వృద్ధుని మృతి

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బిటిఆర్) బఫర్ జోన్ వెలుపల శనివారం అడవి ఏనుగుల దాడిలో ఒక వృద్ధుడు మరణించినట్లు, ఆ రిజర్వ్‌లో ఈ వారంలో మూడు రోజుల్లో పది ఏనుగులు చనిపోయినట్లు అధికారి ఒకరు తెలియజేశారు. మృతుని రామ్త్రన్ యాదవ్ (65)గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ‘అతను శనివారం తెల్లవారు జామున రిజర్వ్ వెలుపల మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు అడవి ఏనుగులు అతనిని తొక్కిచంపాయి’ అని బిటిఆర్ అధికారి వివరించారు. దేవ్రా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు

ఉమారియా డివిజనల్ అటవీ అధికరి (డిఎఫ్‌ఒ) వివేక్ సింగ్ ఫోన్‌లో ‘పిటిఐ’తో చెప్పారు. ఈ వారంలో మూడు రోజుల వ్యవధిలో పది ఏనుగులు మృతి చెందాయి. మంగళవారం రిజర్వ్ ఖితోలి రేంజ్ పరిధిలో సంఖాని, బకేలి గ్రామాల్లో నాలుగు అడవి ఏనుగులు విగతజీవులుగా కనిపించాయి. మరి నాలుగు బుధవారం, రెండు గురువారం చనిపోయాయి. 13 ఏనుగుల బృందంలో మూడు మాత్రమే ప్రస్తుతం సజీవంగా ఉన్నట్లు అధికారులు ఇంతకు ముందు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News