Wednesday, January 22, 2025

అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకు హత్య

- Advertisement -
- Advertisement -

తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…షమా కాలనీకి చెందిన సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తి తన దగ్గరి బంధువైన ఇస్మాయిల్‌కు రూ.2లక్షలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇస్మాయిల్ తిరిగి ఇవ్వకపోవడంతో అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని గత కొంత కాలం నుంచి సైఫ్, ఇస్మాయిల్‌పై ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య అప్పు విషయంలో మాటా మాటా పేరగడంతో ఆగ్రహం చెందిన ఇస్మాయిల్ బండరాయితో సైఫ్‌పై దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News