హైదరాబాద్: రూ.200 కూలి డబ్బుల కోసం తోటి కూలి మరో కూలితో కలిసి వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో వైయస్ ఆర్ సర్కిల్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన పూసల నాగభూషణం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తన్నాడు. ఈ క్రమంలో తోటి కూలి అయిన ఖాసీంకు నాగభూషణం రూ.200 ఇవ్వాల్సి ఉంది. గురువారం ఇద్దరు డబ్బుల విషయమై మాట్లాడుకుంటుండగా గొడవ జరిగింది.
ఖాసీం డబ్బులివ్వమని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోడంతో కోపంతో నాగభూషణంను తోటి కూలితో కలిసి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నాగభూషణంను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నాగభూషణం శుక్రవారం రాత్రి చెందారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాసీం అరెస్ట్ చేశారు. మరో కూలి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.