హైదరాబాద్: అమ్మను తిట్టినందుకు స్నేహితుడిని హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని నేరెడ్ మెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి (31) అనంత్ నగర్ ఈస్ట్ కృపా ఆపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. నవీన్ కూడా అదే వీధిలోని విజయ ఆపార్ట్ మెంటులో ఉంటున్నాడు. ఎప్పుడు నవీన్ పై శ్యామ్ సుందర్ పెత్తనం చెలాయిస్తుండడంతో ఇద్దరు మధ్య విభేదాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం శ్యామ్ సుందర్ మద్యం మత్తులో నవీన్ ఇంటికెళ్లి ఆయన తల్లిని తిట్టాడు. ఇంటికొచ్చిన నవీన్ కు శ్యామ్ తిట్టాడని తన తల్లి చెప్పింది. అమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించిడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే సిమెంట్ ఇటుక తీసుకొని శ్యామ్ తలపై నవీన్ బాదాడు. దీంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్యామ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మను తిట్టినందుకు హత్య….
- Advertisement -
- Advertisement -
- Advertisement -