Sunday, December 22, 2024

తల్లిదండ్రుల్నీ, చెల్లెల్నీ నరికి చంపిన కిరాతకుడు

- Advertisement -
- Advertisement -

కుటుంబ తగాదాల కారణంగా తల్లిదండ్రులనూ, తోడబుట్టిన చెల్లెల్నీ నరికి చంపేశాడు ఒక దుర్మార్గుడు. రాజస్థాన్ లోని పదుకలన్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన గ్రామస్థులను కలవరపరచింది.

పదుకలన్ గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులు దిలీప్ సింగ్ (45), రాజేశ్ కన్వర్ (40) లను, చెల్లెలు ప్రియాంక (15)ను మోహిత్ గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత రాత్రంతా మృతదేహాలతో అదే ఇంట్లో గడిపిన మోహిత్, ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే మోహిత్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

యువకుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని సెల్ ఫోన్ ను తనిఖీ చేయగా, ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే విషయమై అతను సెర్చి చేసినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News