Thursday, December 26, 2024

జగ్గును గొడ్డలితో నరికి చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఆంబోతు తండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆరుబయట నిద్రిస్తున్న జగ్గును దుండగులు గొడ్డలితో నరికి చంపేశారు. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News