Wednesday, January 15, 2025

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కీసర: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నాగారంలో జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దమ్మాగూడ సిద్దార్థ కాలనీలకి చెందిన ధరావత్ సుధాకర్ (42), భారతి దంపతులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఘట్‌కేసర్‌కు వెళ్లి దమ్మాయిగూడకు తిరిగి వస్తుండగా నాగారంలోని రాంపల్లి చౌరస్తా సమీపంలో వేగంగా దూసుకు వచ్చిన కారు వెనకాల నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. భారతికి తీవ్ర గాయాలైనాయి. సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News