Thursday, December 19, 2024

డిజె విషయమై ఘర్షణ: యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Man killed in clash over DJ at Nirmal District

నిర్మల్: పెళ్లి వేడుకలో డిజె విషయమై ఘర్షణ జరిగి యువకుడు మృతిచెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ మండలం కాల్వతండాలో చోటుచేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లలో జరిగిన వివాహ వేడుకల్లో వివాదం తలెత్తింది. పెళ్లి వేడుకలో డిజె విషయంలో పొరుగు ఇళ్ల బంధువుల మధ్య గొడవ జరిగింది. మరో వర్గం దాడిలో నవీన్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News