Monday, December 23, 2024

వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

వ్యక్తి దారుణ హత్య
గొంతు కోసి హత్య చేసిన దుండగులు
చెన్నాపురం చెరువు వద్ద ఘటన
మన తెలంగాణ/జవహర్ నగర్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద శనివారం రాత్రి 7.30 గంటలకు ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి వేణు అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి అతి దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పాత కక్షలతోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యతో ఒక్కసారిగా జవహర్‌నగర్ ఉలిక్కిపడింది. పోలీస్‌లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం… జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన వేణు (35)అనే యువకుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి 7.30 నిమిషాలకు వేణు అతని ఇద్దరు మిత్రులు చెన్నాపురం నుంచి లక్ష్మీనరసింహ కాలనీకి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన దుండగులు కారుతో ఢీకొట్టిన అనంతరం వేణును కత్తితో గొంతుకోసి హత్య చేసి పారిపోయారు. దుండగులు వచ్చిన స్వీప్ట్ కారును అక్కడే వదిలేసి పారిపోయారు.

లక్ష్మీనరసింహ కాలనీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి రియల్ బిజినెస్‌లో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనిపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లుగా అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్‌స్పెక్టర్ సీతారాం తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News