Sunday, December 29, 2024

ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లో ప్రమాదం.. ప్రయాణికుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో శనివారం భారీ వర్షం కారణంగా ప్రయాణికుల షెల్టర్‌లో కొంత భాగం కూలిపోయి ఒక 60 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుడిని ప్రయాగ్‌రాజ్‌లోని ఇనాయత్ పోలీసు స్టేషన్ పరిధిలోని బికాపూర్ గ్రామానికి చెందిన గురుదిన్ భర్తియాగా గుర్తించారు. వర్షం పడుతుండడంతో రైల్వే స్టేషన్‌లో షెల్టర్ కింద నిలుచున్న ప్రయాణికుడిపై పైకప్పులోని కొంత భాగం కూలిపోయినట్లు షాహ్‌గంజ్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ వినయ్ సింగ్ తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాసింజర్ షెల్టర్‌ను పూర్తిగా తనిఖీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. నిబంంధనల ప్రకారం మృతుడి కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News