Sunday, December 22, 2024

నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని చందుబట్ల గేటు వద్ద గురువారం సాయంత్రం నిలబడి ఉన్న ఏపి 31 టియు 8889 నెంబర్ గల లారీని వెనుక నుంచి ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామానికి చెందిన సింగారం శ్రీశైలం(28) అనే తాపి మేస్త్రీ అత్తగారి ఊరైన పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపురానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య సునితతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ ఘటనపై నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News