Thursday, January 23, 2025

విషాదం: బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉన్న తిప్పారెడ్డిపల్లి గేటు వద్ద కారు బైక్ ఢీ కొనడంతో గొల్ల కృష్ణయ్య(45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలంలోని పుల్జాల గ్రామానికి చెందిన గొల్ల కృష్ణయ్య అనే వ్యక్తి తన బైక్ పై దిండి మండలం రామాంతపూర్ గ్రామంలో తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా తిప్పారెడ్డిపల్లి గేట్ దగ్గర శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న గొల్ల కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స కోసం దావఖానాకు తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోవడం జరిగిందని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News